మే 28న ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Officer Pre-Release Event on May 28

Officer Pre-Release Event on May 28

Date:25/05/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
శివ సినిమాతో తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సైకిల్ చైన్ తెంపడం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఆ తరవాత అలాంటి విజయాన్ని వర్మ ఇప్పటి వరకు అందుకోలేదు. ఎప్పుడూ వివాదాలతో బిజీగా ఉండే వర్మ పనైపోయిందని, వర్మ మైండ్‌లో గుజ్జులేదని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. అయితే తనలో ఇంకా ఆ దర్శకత్వ సేవ తగ్గలేదని, తానేంటో చూపిస్తానని అంటూ నాగార్జునతో 25 ఏళ్ల తరవాత సినిమా చేశారు. అదే ‘ఆఫీసర్’. ముంబై బ్యాక్‌ డ్రాప్‌లో ఓ పోలీస్ అధికారి కథ ఆధారంగా తెరెక్కిన ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. అయితే ‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 28న నిర్వహించనున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించారు. మే 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఎన్ కన్వెన్సన్ సెంటర్‌లో ‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు నాగార్జున అభిమానులంతా తరలివచ్చి జయప్రదం చేయాలని వర్మ పిలుపునిచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ‘నవ్వే నువ్వు’ అనే పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఈ ‘ఆఫీసర్’ సినిమా ‘శివ’ రేంజులో ఉంటుందా అంటే అనుమానమే. కానీ చాలా కాలం తరవాత నాగ్-ఆర్జీవీ కాంబినేషన్‌లో సినిమా కాబట్టి సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి.
Tags: Officer Pre-Release Event on May 28

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *