డ్యూటీలు ఎగ్గొడుతున్న అధికారులు

హైదరాబాద్   ముచ్చట్లు:

కొవిడ్ విజృంభణ, అడిషనల్ డ్యూటీల పేరిట జీహెచ్ఎంసీ అధికారులు కొందరు తాము నిర్వర్తంచాల్సిన విధులను ఎగ్గొడుతున్నారు. అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవలను అందించే జీహెచ్ఎంసీ అధికారులను పోలీసులు లాక్ డౌన్ లోనూ అనుమతిస్తున్నారు. కానీ కొందరు అధికారులు విధులకు హాజరుకాకపోవటంతో పలు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కరోనా ఆంక్షలు చెబుతూ మరికొందరు అధికారులు, వారి కింది స్దాయి సిబ్బంది హాయిగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమాని పేరు మార్పు వచ్చే దరఖాస్తుల పరిశీలన, క్లయరెన్స్ పెండింగ్ లో పడిపోయింది, అంతేగాక, ఒక ఆస్తిని కొనుగోలు చేసిన యజమానికి తమ పేరిట ఆస్తిని మార్చుకునేందుకు ఆ మొత్తం ఆస్తి విలువలో అర్ద రూపాయి విలువను ఫీజుగా డీడీ రూపంలో సర్కారుకు చెల్లించాల్సి ఉంటుంది.గ్రేటర్ లోని దాదాపు అన్ని సర్కిళ్లలో ఇలాంటి మ్యుటేషన్ ఫైలు వచ్చిందంటే చాలు ఫీజు చెల్లింపు సరే మా సంగతేంటీ? అని సర్కిళ్లలోని ట్యాక్స్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. యజమాని పేరు మార్పు కోసం వచ్చే ఈ రకమైన దరఖాస్త్తులను క్షేత్ర స్దాయిలో పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాల్సిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ దరఖాస్తుదారుడ్ని ఆఫీసు చుట్టూ తప్పించుకుంటున్న ముషీరాబాద్ సర్కిల్ లోని ఓ అధికారిపై బాధితుడు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తన మ్యుటేషన్ ఫైలును పరిశీలించాలని అడగ్గా, సదరు అధికారి లంఛం డిమాండ్ చేసినట్ట్లు ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్(రెవెన్యూ) ప్రియాంకతో పాటు చీఫ్ వ్యాలుయేషన్ ఆఫీసర్ కులకర్ణికి కూడా ఫిరాదు చేశాడు, ఫిర్యాదును పరిశీలించిన ఉన్నతాధికారి సదరు సర్కిల్ అధికారికి మెమో జారీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.రేపోమాపో మెమో తీసుకోనున్న సర్కిల్ అధికారిపై స్దానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా పలు అంశాలపై తీవ్ర స్దాయిలో మండిపడినట్లు తెలిసింది. గతంలో దరఖాస్తుదారుడు లంఛమివ్వలేదన్న అక్కసుతో ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఒకరి ఆస్తి మరొకరి పేరిట మ్యుటేషన్ చేసిన ఓ ప్రైవేటు ఉద్యోగిని విధుల నుంచి తోలగించారు. ఈ రకంగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గతంలో ఎన్నో సార్లు మండిపడ్డా, అధికారుల విధి నిర్వహణ తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం విచారకరం.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Officers on duty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *