చల్లపల్లి బాధిత విద్యార్ధినులను పరామర్శించిన అధికారులు

అవనిగడ్డ ముచ్చట్లు:

కృష్ణాజిల్లా  అవనిగడ్డ నియోజకవర్గం లోని చల్లపల్లి బాలికల వసతి గృహ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రాజ్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థులు వాంతులు కావడంతో చల్లపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న విద్యార్థులలో నలుగురు ఎనిమిదో తరగతి ఇద్దరు 9వ తరగతి ఒక విద్యార్థి 10వ తరగతి చదువుతున్నారు విద్యార్థులు వాంతులతో పాటు కడుపునొప్పి జ్వరం ఉండడంతో నిరసించిపోయారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు విద్యార్థులకు వివిధ రకాల టెస్టులు చేసామని తెలుపుతూ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

 

Tags: Officers visited the affected students of Challapally

Leave A Reply

Your email address will not be published.