Natyam ad

పంటలను పరిశీలించిన అధికారులు

సంగారెడ్డి ముచ్చట్లు:

 

 

సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. జహీరాబాద్, కోహిర్ మండలాల్లో నిన్న సాయంత్రం కుండపోతగా కురిసిన రాళ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీత, జహీరాబాద్ ఏడిఏ బిక్షపతి సందర్శించారు. కోహీర్ మండలం బడంపేట్, మునియార్ పల్లి, సజ్జాపూర్ తో పాటు జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రధానంగా మొక్కజొన్న, బొప్పాయి, పుచ్చకాయ, ఉల్లి, మామిడి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. బడంపేట్ లో రైతులు, గ్రామస్తులతో జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు గ్రామసభ నిర్వహించి రాళ్ళవాన నష్టాలపై అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. చేతికి అంది వచ్చే పంటలు కుంభవృష్టిగా కురిసిన వడగళ్ల తో 90 శాతం మేర దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఆదుకునేలా చూడాలని రైతులు అధికారులను వేడుకున్నారు. వర్షం చినుకుల మించి రాళ్ల వాన పడటంతో పంట పొలాలు కాశ్మీరాన్ని తలపించాయని రైతులు అధికారుల ముందు గోడువెళ్ళబోసుకున్నారు. మామిడి తోటల్లో ఖాతా, పెందేలు రాలి పడి తీవ్ర నష్టం వాటిలిందని ఉద్యాన శాఖ అధికారులు పరిహారం అందేలా చూడాలని తోటల యజమానులు రైతులు కోరారు.
Tags;Officers who inspected the crops

Post Midle
Post Midle