జనసేన చేపట్టిన కార్యక్రమానికి స్పందించిన అధికారులు

అన్నమయ్య ముచ్చట్లు:


రైల్వే కోడూరు పట్టణ పరిధిలో స్థానిక ఎంజి రోడ్డులో ఇటీవల రోడ్డు భారీగా దెబ్బతినడంతో అటుగా వెళ్లే లారీలు బస్సులు ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమాన్ని జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని పిలుపులో భాగంగా రైల్వేకోడూరులోని జనసేన నాయకులు ఉత్తరాది శివకుమార్,మర్రి రెడ్డి ప్రసాద్,ముత్యాల కిషోర్, గిరిధర్, రవికుమార్, జన సైనికులతో కలిసి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఫ్లక్ కార్డులను పట్టుకొని దెబ్బతిన్న రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు. మా నిరసనను స్వీకరించిన సంబంధిత అధికారులు శనివారం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ విధంగా మనమతులు చేపట్టి వాహనదారులకు ఆటకం కలగకుండా జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమానికి స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, సమస్య ఎక్కడుంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుందని జనసేన నాయకుడు మర్రి రెడ్డి ప్రసాద్ తెలియజేశారు.

 

 

Tags: Officers who responded to the program undertaken by Janasena

Leave A Reply

Your email address will not be published.