శ్రీ‌వారి ద‌ర్శించుకున్న శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం అధికారులు

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం అధికారులు మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డిని శ్రీ వైష్ణోదేవి ఆలయ అధికారులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.టీటీడీ ఈవో నుంచి వైష్ణోదేవి ఆలయ అధికారులు సలహాలు, సూచ‌న‌లు స్వీకరించారు. శ్రీ మాత వైష్ణోదేవి ప్రసాదాన్ని ఈవోకు అందించారు. అనంత‌రం ఈవో శ్రీ వైష్ణోదేవి బృందాన్ని శాలువాతో సత్కరించారు. తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న క్యూలైన్లు, పోటు, హెల్త్ ఆఫీస్, అశ్వని వైద్యశాల, సి.ఆర్.ఓ ఆఫీస్, సన్నిధానం, మాధవం, డోనర్ సెల్, అన్నప్రసాదం వంటి అనేక విభాగాలను అధికారుల బృందం పరిశీలించి, అక్కడి అధికారులనడిగి పాల‌నా ప‌ర‌మైన‌ విషయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణోదేవి ఆలయ సంయుక్త ఛీఫ్ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సునీల్ శర్మ, ఆలయ అధికారులు విష్వజిత్ సింగ్, దినిష్ గుప్త,  షమి శర్మ, శ్వేత డైరక్టర్  ప్రశాంతి, సమన్వయకర్త పివి.బాలాజీ దీక్షితులు పాల్గొన్నారు.

 

Tags: Officials of Sri Mata Vaishnodevi Temple visited by Srivari

Leave A Reply

Your email address will not be published.