కల్తీ పాలపై అధికారుల దాడులు
యాదాద్రి ముచ్చట్లు :
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు ఆహార భద్రత అధికారులు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రత్యేక తనిఖీ వాహనంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి తనిఖీలు చేపట్టారు. 15 వాహనాలను పైగా తనిఖీలు చేసారు. అందులో ఆరు వాహనాలు కల్తీ పాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటి శాంపిల్లలను సేకరించి వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసుల సహాయంతో వాహనాలను తనిఖీ చేసారు. బీబీనగర్ మండల కేంద్రంలో లో ఓ ఇంట్లో కల్తి పాల తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారని గుర్తించారు. భువనగిరి మండలం నుండి మూడు వాహనాల్లో కల్తీ పాలు వెళ్లడాన్ని గుర్తించారు. రెండు రోజుల క్రితమే ఎస్ఓటి పోలీసులు సిఐ నవీన్ ఆధ్వర్యంలో కల్తీ పాల గుట్టును రట్టు చేశారు.
Tags: Officials raid on adulterated milk

