ప్రభుత్వ విధులను అధికారులు సక్రమంగా  నిర్వహించాలి

పెద్దపల్లి ముచ్చట్లు:

ప్రభుత్వ విధులను అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని, కార్యాలయంలో సమయపాలన పాటించాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ సి.హెచ్.

మధుసూధన్ లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లా అధికారులు ప్రజావాణి పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజావాణికి తప్పనిసరిగా హాజరు కావాలని, తమ క్రింది స్థాయి సిబ్బందిని ప్రజావాణికి

పంపడం గమనించడం జరిగిందని, ఇట్టి చర్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రజావాణికి హాజరు కానీ అధికారులపై చర్యలు తప్పవని సూచించారు. జిల్లాలోని ప్రతి శాఖ తమ అంతర్గత సమావేశాలు

నిర్వహించుకోవాలని, ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాసమస్యలపై అలసత్వం వహించవద్దని, కొంత మంది అధికారులు ప్రజలను తిప్పుకోవడం

గమనించామని,  ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని పరిష్కారం కాని పక్షంలో దానికి గల కారణాలు తెలియజేస్తూ సమాధానం అందించాలని, అనవసరంగా ప్రజలను తిప్పుకోవద్దని కలెక్టర్

పేర్కొన్నారు. విధులకు ప్రభుత్వ సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో టీచర్లు, ఆసుపత్రిలో నర్సులు, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శిలు మొదలగు క్షేత్ర

సిబ్బంది సైతం సమయపాలన పాటించేలా అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పని చేసే విధానాన్ని ప్రతి మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో చదివే కొంతమంది విద్యార్థులకు వివరిస్తూ సందర్శన చేయించడం జరుగుతుందని అన్నారు. సమీకృత జిల్లా

కలెక్టరేట్ లో పనిచేసే విధానాన్ని గమనించిన తర్వాత విద్యార్థులతో కలెక్టర్ లేదా ఉన్నతాధికారి భోజనం చేస్తారని కలెక్టర్ తెలిపారు.ప్రతి బుధవారం జిల్లా అధికారులు జిల్లాలోని విద్యా సంస్థల్లో మధ్యాహ్నం

భోజనం చేయాలని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో అధికారులు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని, భోజన నాణ్యతపై నివేదిక అందించాలని అన్నారు.

జిల్లా అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే క్షేత్ర స్థాయిలో భోజన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు. సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన పసుల మల్లయ్య

భూమి పంపిణీ నిమిత్తం తన కుమారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనకు తెలియకుండా భూమిని అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ముందు చేసిన రిజిస్ట్రేషన్ రద్దుచేసి ఎనిమిది ఎకరాల

భూమిని తన పేరుపై వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,

సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Officials should perform government duties properly

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *