అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు
ప్రకాశం ముచ్చట్లు:
ప్రకాశంజిల్లా జరుగుమల్లిలో అక్రమంగా ఇసుక తరలించటానికి జె.పి.కంపిని చేసిన ప్రయత్నాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో అడ్డుకున్నారు.తమకు ఇసుక తరలించేందుకు అనుమతి ఉందంటూ గ్రామ సమీపంలో ఉన్న ఏటినుండి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఒక జె.సి.బి. తోపాటు ఇరవై ట్రాక్టర్ల తో వచ్చి ఇసుకను తరలించడానికి ప్రయత్నం చేశారు. ఇసుక తరిలింపునకు అనుమతులు ఉన్నాయా అని వారిని గ్రామ సర్పంచ్, ఎం.పి.టి.సి. నిలదీయగా వారు అనుమతులు చూపించకుండా హడావిడి చేయడంతో ఇసుక తరలింపును అడ్డగించి ఈ విషయాన్ని సింగరాయకొండ సి.ఐ. రంగనాధ్ దృష్టికితీసుకెళ్లారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమతి పత్రాలు చూపించాల్సిందిగా ఇసుక తరలింపు దారులను కోరారు. వారిదగ్గర ఎటువంటి అనుమతిపత్రాలు లేకపోగా సరైన సమాదానంచెప్పలేని పరిస్థితి నెలకొంది. దింతో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమగ్రామంలో ఉన్న ఇసుకను రీచ్ నుండి తరలించడానికి మా గ్రామస్తులం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగరించమని వారు స్పష్టంచేశారు. ఇప్పటికే గ్రామంలోని భూగర్భజలాలు అడుగంటాయని రాబోవు రోజుల్లో నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలింపు చేస్తూ చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Tags: Officials stopped illegal sand transport

