తొట్టంబేడు భూకబ్జాలు  పై కన్నెర్ర చేసిన అధికారులు.. !

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సహించేది లేదు
ఎమ్మార్వో పరమేశ్వరరావు.
చిత్తూరు  ముచ్చట్లు:
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని   తొట్టంబేడు మండలం కొన్ని రోజులుగా భూకబ్జాలు పరంపర కొనసాగుతోంది.   బుధవారం సర్వే నెంబర్ 78 లో అక్రమంగా నిర్మించినటువంటి  కట్టడాన్ని పలుమీడియాలో,  పత్రికల్లో  కథనాలు రావడంతో తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వరరావు  తన సిబ్బంది ఆర్ఐ నాగరాజు, వీఆర్వో చిట్టిబాబు, మాధవి,  ధనంజయలతో కలిసి అక్రమ కట్టడం ని జెసిబి పెట్టి తొలగించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ  గతంలో ఈ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయినప్పటికీ వారు మా ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఈరోజు ప్రభుత్వ భూమి అని సర్వే నెంబర్ 78 లో అక్రమంగా నిర్మించిన  కట్టడాన్ని తొలగించడం జరిగిందని ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించితే  ఉపేక్షించేది లేదని వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.  అదే విధంగా ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Officials who conned the Thottambedu land grabs ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *