ఉదయం 9 గంటలకే అరణియార్ గేట్లు ఎత్తనున్న అధికారులు

– 27 అడుగులకు చేరుకుంటున్న నీటిమట్టం..

– గంటకు 6 వేలు క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉండడం వల్లే..

– నిర్ణీత సమయం కన్నా ముందే గేట్లు ఎత్తే ప్రయత్నం..

– అరుణ నది ఇరువైపులా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్..

 

అమరావతి ముచ్చట్లు:

ఉదయం 9 గంటలకే అరణియార్ గేట్ల ను పైకెత్తి అధిక వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ ఈఈ మదన గోపాల్ వెల్లడించారు.ఉదయం 5 గంటలకే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఈఈ మదన గోపాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.ఈ మేరకు ప్రాజెక్టు దిగువన ఉన్న అరుణా నది ఇరువైపుల రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ మాట్లాడుతూ అరణియార్ కు వచ్చే ఇన్ ఫ్లో సుమారు 6 వేలు క్యూసెక్కుల ఉండడం.. ప్రాజెక్టు నీటిమట్టం 27అడుగులకుచేరుకుంటుందన్నారు.ఇన్ ఫ్లో భారీగా పెరుగుతుండడం వల్ల నిర్ణీత సమయం కన్నా ముందే గేట్లు ఎత్తాలని నిర్ణయించినట్లు ఈ ఈ వెల్లడించారు.ఈ సమాచారాన్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు, రెవిన్యూ అధికారులతో పాటు అన్నీ శాఖల అధికారులకు, తమిళనాడు ఉన్నతాధికారులకు చెరవెస్తున్నారు.వరదనీరు విడుదలకు ప్రజలు, ఆయకట్ట రైతులు, అన్ని శాఖల అధికారులు, సహకరించాలని ఈ విజ్ఞప్తి చేశారు.

 

Tags: Officials will lift Araniyar gates at 9 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *