నిక్షిప్తంగా ఉన్న చమురు నిల్వలను వెలికితీయాలి  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె  రామాంజనేయులు

డోన్   ముచ్చట్లు :
కర్నూలు జిల్లాలో క్రిష్ణగిరి మండలంలో నిక్షిప్తమై ఉన్న ముడి చమురు నిల్వలను వెలికితీసి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రజలకు సౌకర్యం కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 సంవత్సరం అం లో ఏ రాష్ట్రంలో విశాఖపట్నం కృష్ణా ప్రకాశం కడప జిల్లాలతోపాటు కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తరఫున గ్లోబల్ ఎకోల జిన్ అనే సర్వే సంస్థ ద్వారా ఉపగ్రహం2డి సర్వేల ఆధారంగా చేసిన సర్వే ప్రకారం కర్నూలు జిల్లాలో క్రిష్ణగిరి మండలం, కంబలపాడు, అమకతడు, మాధారపురం  గ్రామ పరిసరాల భూమిలో 2వేల అడుగుల లోతున విస్తారంగా 60 బిలియన్ బ్యారల్ ముడి చమురు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయని గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయని రిపోర్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ తెలియజేయడం జరిగింది.4 సంవత్సరాలు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం ప్రస్తుతం దుబాయ్ యూఏఈ దేశాల నుండి దిగుమతి చేసుకుని పెట్రోలు లిటర్ ధర 105 రూపాయలు , డీజలు 98 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి కాబట్టి మేము పెంచక తప్పదని సమాధానం ఇస్తున్నాయి మన దేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిక్షిప్తంగా అయి ఉన్న ముడిచమురు వెలికి తీయడం ద్వారా పది సంవత్సరాల కిందట ఉన్నా! రేట్ల కె ప్రజలకు అందించవచ్చు ప్రస్తుతం పెట్రోలు డీజిల్ గ్యాస్ సాధారణ ప్రజల నుండి అందరికీ నిత్యవసర అయినా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిరోజు ధరలు పెంచి ప్రజలపై పెను భారం మోపుతూ అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు రవాణా చార్జీలు పెరిగి ప్రజలపై పన్నుల భారం మోపే బదులు స్థానికంగా దొరికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను వెలికి తీసి ధరలు తగ్గించి ప్రజలకు సౌకర్యం కల్పించవచ్చు అందుకే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఓఎన్జిసి ద్వారా తమ్ముడు వెలికితీసేందుకు చమురు శుద్ధి కర్మాగారం స్థాపించాలని ఆ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న చమురు నిల్వల వివరాలు బయటపడే వరకు భూములు కొనుగోలు అమ్మకాల నిలిపివేయాలని రాష్ట్రంలో కర్నూలు జిల్లా కూడా దుబాయ్ ఆఫ్ ఇండియా గా మారెందు కు ఉన్న అవకాశాలను వినియోగించేందుకు 6 వేల కోట్ల బ్యారల్ ముడి చమురు పూర్తి గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చంద్రునిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పూను కోలుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు . డోన్ ప్రాంతంలో ప్యాపిలి డోన్  బేతంచెర్ల క్రిష్ణగిరి వెల్దుర్తి ప్రాంతాల్లో కేంద్రంగా ఉన్న డోన్ పరిసరాలలో  లభ్యమవుతున్న ఇసుక రు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అన్ని మండల కేంద్రాల్లో ఇసుక డంప్ లను  ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు ప్రజలకు తక్కువ ధరకు సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ డోన్ నియెజకవర్గ కార్యదర్శి ఎన్.రంగ నాయుడు, విజ్ఞప్తి చేశారు గతంలో మార్కెట్ యార్డ్ నందు ఇసుక డంప్ ఏర్పాటు చేశారని అయితే ప్రస్తుతం అమలు కాకపోవడం వల్ల స్థానిక అధికార పార్టీకి చెందిన కొంత మంది ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి స్థానికంగా గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని ద్వారా ప్రజలకు సౌకర్యం కల్పించాలని 30 వేల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక అల్లాడుతున్నారు కార్మికులకు ఉపాధి కల్పించడేమే కాక. సొంత ఇంటి నిర్మాణం చేసుకునే సాధారణ మధ్యతరగతి ప్రజలకు కూడా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాధాకృష్ణ, డోన్ పట్టణ కార్యదర్శి.నక్కి.శ్రీకాంత్, ప్రభాకర్, గౌండా బాష పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Oil reserves should be extracted
CPI state executive committee members K Ramanjaneyulu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *