చమురు సెగ..

కుక్కునూరుముచ్చట్లు :

 

పెంచిన పెట్రోల్,డీజిల్ మరియు గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, మంగళవారం కుక్కునూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద కేంద్రరాష్ట్ర పార్టీల కమిటీల  పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే. గౌస్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 27 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగిందని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నులు వేసి దోపిడి చేస్తున్నారని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక బ్యారెల్ అనగా 158 లీటర్ల 967 మిల్లీ లీటర్ల ధర 66 డాలర్లు ఉండగా దేశ కరెన్సి ప్రకారం ఒక డాలర్ కు రూ.74.14 పైసలు ప్రకారం  సుమారు 11 వేల రూపాయలు దోపిడీకి గురవుతున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో లీటర్కు 0.32 రూపాయలు ఉండగా మన దగ్గర 100 రూపాయలు పెంచి లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలపై మోయలేని భారం పన్నుల భారం వేసి దోపిడీ చేసే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజలందరూ వ్యతిరేకించాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగేంద్రరావు పెంచిన ధరలు తగ్గెంతవరకు ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పూరెం లక్ష్మయ్య, పి.బాబు, పి. ప్రసాద్ , రాములు తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Oil sega ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *