Natyam ad

 అయిల్ ట్యాంకర్ కి మంటలు

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. వెంటనే ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి.ఈ ఘటనలో డ్రైవర్ బయటకు దూకి తప్పించుకున్నాడు. అక్కడే పలువురు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడం తో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.
..అంగన్వాడీ కార్యకర్తలు దశల వారీగా తమ నిరసనలు కొన సాగిస్తున్నారు.విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాత్రి కూడా అంగన్వాడీలో ఆందో ళన కొనసాగించారు. రాత్రి 10 గంటలకు చలిమంటలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చెట్టు మీద కొంగ జగనన్న దొంగ అంటూ నినాదా లు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గత కొద్ది రోజులు గా అంగన్వాడీలో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రోజురోజుకూ వినూ త్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

 

Post Midle

Tags: Oil tanker caught fire

Post Midle