ట్రాన్స్ ఫారాలను టార్గెట్ చేస్తున్న అయిల్ దొంగలు

పరిగి  ముచ్చట్లు :
రైతులు మామూలుగా చీడ పీడల బెడదతో భాదపడుతుంటారు.కానీ ఇక్కడ మాత్రం దొంగలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. చడి చప్పుడు కాకుండా నాలుగు నట్లు ఊడదీసి చాకచక్యంగా రైతులను,విద్యుత్ అధికారులను దొంగలు ఇబ్బందులపాలు చేస్తున్నారు. పొలాల వద్ద బోరు మోటార్ల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల లో ఆయిల్ దొంగిలిస్తూ ఎవరికి చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నారు. వాయిస్:వికారాబాద్ జిల్లా పరిగి రైతులకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.రైతుల పొలాల వద్ద మోటారు పంపుసెట్ల కోసం  ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ పై దొంగల కన్ను పడింది.అర్థరాత్రి సమయంలో ట్రాన్స్ఫార్మర్ నట్లు ఊడదీసి అందులో ఉన్న ఆయిల్ ను దొంగిలిస్తున్నారు.చడి చప్పుడు లేకుండా చాకచక్యంగా నాలుగు నట్లు ఊడదీసి ట్రాన్స్ఫార్మర్ లోకి పైపు వేసి ఆయిల్ లాగేస్తున్నారు.మరో చోటైతే ట్రాన్స్ఫార్మర్ ను దిమ్మె పై నుండి కిందకు తోసి అందులో ఉన్న రాగి వైర్లను,ఆయిల్ ను దొంగిలించారు.ఈ చోరీలు పరిగి మండలంలోని వివిధ గ్రామాల్లో నెల వ్యవధిలో మూడు చోట్ల జరిగింది. పరిగి మండలం సయ్యద్ పల్లిలో ఓకే ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ ను దొంగలు రెండు సార్లు దొంగిలించారు. పరిగి మండలం రంగంపల్లిలో ట్రాన్స్ఫార్మర్ నట్లు ఊడదీసి ఆయిల్ దొంగిలించారు. పరిగి మండలం రూప్ ఖాన్ పేట్ గ్రామ సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ ను దిమ్మ పై నుండి కిందకు తోసి అందులో ఆయిల్, రాగి వైర్లను ఎత్తుకెళ్లారు. పూడురు మండలం కంకల్ గ్రామంలో వారం రోజుల క్రితం ఇదే ఘటన చోటుచేసుకుంది.ఈ దొంగల వ్యవహారంతో పరిగి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఉదయం బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్ళిన రైతులు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చూసి అవాక్కవుతున్నారు.ఒక్కో ట్రాన్స్ఫార్మర్ లో 30 – 35 లీటర్ల ఆయిల్ పడుతుందని,లీటర్ ఆయిల్ ధర 300/- వందల రూపాయలు ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. దాదాపు 100 కిలోల రాగి వైరు వుంటుందని…విద్యుత్ వ్యవస్థపై మంచి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరిలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రైతులతో పాటు తాము కూడా పోలీసులకు పిర్యాదు చేశామని పరిగి ఏఇ తెలిపారు.ఇలా వరుస దొంగ తనాలపై పరిగి పోలీసులు దృష్టి సారించారు.విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో దొంగలను తొందరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Oil thieves targeting transformers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *