ఓకే ఊరు..ఒకే రిజిస్ట్రేషన్..

Date:06/08/2020

జంగారెడ్డి గూడెం ముచ్చట్లు:

ఓకే ఊరు.. ఓకే రిజిస్ట్రేషన్.. ఆ.. రికార్డుల పై రెండు అబులెన్సులు నడుపుతూ అధికారులకు ఆ వాహనాలు పట్టు పడ్డాయి. ఇందుకు సంబంధించి న వివరాలు పక్చిమ గోదావరి జిల్లాలో బయట పడ్డాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో రెండు అంబులెన్స్లు ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో తిరుగుతూ రవాణా శాఖ అధికారులకు బుధవారం చిక్కాయి. పట్టణంలోని పీవీఆర్ ప్రైవేటు ఆసుపత్రి చేస్తున్న ఈ నిర్వాకాన్ని జంగారెడ్డిగూడెం ఎంవీఐ కాశీఈశ్వరరావు బుధవారం ఛేదించారు. ఆయన కథనం  ప్రకారం.. ఏపీ 16 టీసీ 5544 నంబరుతో రెండు అంబులెన్స్లను నడుపుతున్నారు. ఈ విషయం వెలుగు చూడటంతో రెండు వాహనాలను సీజ్ చేసి ఎంవీఐ యూనిట్ కార్యాలయానికి బుధవారం తరలించారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా నడుపుతున్నారన్న అభియోగంపై కేసు నమోదు చేసి, రూ.3,500 అపరాధ రుసుము విధించినట్లు ఎంవీఐ కాశీఈశ్వరరావు తెలిపారు.

తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ

Tags: OK town..only registration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *