అక్రమాలపై నోటీసులతో సరా…
వరంగల్ ముచ్చట్లు:
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అక్రమ వెంచర్ల జోరు యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తు న్నారు. ఐదారు ఎకరాలు స్థలం కొనుగోలు చేసి, అందులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే నేరుగా ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్లకు హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తూ విక్రయిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. అక్రమ వెంచర్లపై మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు అందిన తరువాత వెంచర్లకు వెళ్లి హద్దురాళ్లు తొలగించడం మినహా ఇతరత్రా చర్యలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్ పై అధికారులు వల్లమాలిన ప్రేమను వలకబోస్తున్నారు. అక్రమ లే అవుట్ నిర్వాహాకుడికి ఇబ్బంది కలగకుండా రక్షణగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరులోని 869/B/2/2 సర్వే నంబర్లో ఎలాంటి అనుమతుల్లేకుండా వెంచర్ నిర్మాణం జరుగుతోంది. ఇదే విషయం ఎంపీవో చేతన్ కుమార్ రెడ్డి, కార్యదర్శి మేడ యాదగిరి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేసుకున్నారు. పర్మిషన్స్ లేని వెంచర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లుగా వెల్లడించారు.
ఇది జరిగి నెలలు గడుస్తున్నా అధికారుల చర్యలు మాత్రం కానరాకపోవడం గమనార్హం. మరో వైపు ప్లాట్ల అమ్మకాలకు నిర్వాహాకులు ప్రయత్నాలు సాగిస్తుంటం గమనార్హం. ఇదంతా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆత్మకూరు మండల కేంద్రంలో 869/B/2/2 సర్వే నంబర్లో ఏర్పాటు చేసిన వెంచర్‌కు అధికారుల అండదండలున్నట్లుగా స్పష్టమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వెంచర్‌పై మీడియాలో కథనాలు వెలువడుతున్నా పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుండటం వారి మొండి వైఖరిని బయటపెడుతోంది. హన్మకొండ ఆర్డీవో వాసుచంద్రతో పాటు ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.అక్రమ వెంచర్ నిర్మాణం విషయంపై గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా మరోసారి ‘దిశ’ రిపోర్టర్ వెంచర్‌పై చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలేంటని ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. ఈనెల 2న వెంచర్ యాజమానులకు నోటీస్ లు జారీ చేయాలని ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కార్యదర్శి మేడ యాదగిరిని వివరణ కోరగా అక్రమ వెంచర్ చేస్తున్న యజమానులకు సోమవారం నోటీసులు జారీ చేశామని, అయితే కుటుంబ సభ్యులుగానీ, సంబంధీకులు గాని ఇంటి వద్ద లేరని, త్వరలోనే నేరుగా కలిసి అందజేస్తామని వెల్లడించారు.

మంచిర్యాలలో సైతం
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అక్రమ వెంచర్ల జోరు యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తు న్నారు. ఐదారు ఎకరాలు స్థలం కొనుగోలు చేసి, అందులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే నేరుగా ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్లకు హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తూ విక్రయిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. అక్రమ వెంచర్లపై మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు అందిన తరువాత వెంచర్లకు వెళ్లి హద్దురాళ్లు తొలగించడం మినహా ఇతరత్రా చర్యలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒక్కో వెంచర్‌పై ఏకంగా ఐదారు రెట్లు లాభాలు గడిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికారులు సందర్శించినప్పుడు మామూళ్ళు ముట్టజెప్పుతూ పనులు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారీతిన వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసే స్థలంలో యజమానులు 30 ఫీట్ల వెడల్పు రోడ్లను నిర్మించాలి. రోడ్ల చివర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను సిమెంట్, కాంక్రీటుతో నిర్మించాలి. కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొనే ప్రజలకు ఆహ్లాదం కోసం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల నిబంధనల మేరకు పార్కులను ఏర్పాటు చేయాలి. అందులో సొంత ఖర్చులతో మొక్కలు నాటి అభివృద్ధి చేయాలి. దీని కోసం స్థానిక సంస్థలకు 10 శాతం స్థలం వెంచర్ యజమానులు అప్పగించాలి. సదరు స్థలాన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ ఏర్పాట్లు అన్ని చేశాక లే అవుట్ అనుమతులకు దరఖాస్తు చేయాలి. అధికారులు నిబంధనల మేరకు అభివృద్ధి జరిగిన పక్షంలో లే అవుట్ అనుమతులు మంజూరు చేస్తారు. లే అవుట్ అనుమతులకు నిర్ణీత ఫీజును ప్రభుత్వానికి చెల్లించాలి.
ప్రస్తుతం ఏర్పాటవుతున్న వెంచర్లలో ఎక్కడా కూడా పై నిబంధనలు అమలు కావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికీ భారీ గండి పడుతోంది. జిల్లా కేంద్రంతోపాటు హాజీపూర్, దొనబండ, లక్షెట్టిపేట, నస్పూర్, జైపూర్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ, బెల్లంపల్లి ఏరియాల్లో అనుమతుల్లేని అక్రమ వెంచర్లు నిత్యం పుట్టుకొస్తున్నాయి.జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. వివిధ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత మంచిర్యాలలోని శాలివాహన విద్యుత్ ప్లాంటు వెనుక ఎస్సీ కాలనీ సమీపంలో ఇటీవల మూడు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10 ఎకరాల్లో భూమిని చదును చేసిన వ్యాపారులు రోడ్లు, ప్లాట్ల పేరిట హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. అక్కడ భూముల ధర ఎకరా రూ.30 లక్షలకు మించి ఉండదు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన వెంచర్లలో చదరపు గజం ధర రూ.2500 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 200 చదరపు గజాల ప్లాటు కొనుగోలు చేస్తే దాదాపు రూ.7 లక్షలు అవుతుంది. మున్సిపాలిటీకి స్థలం ఇచ్చేది లేనందున ఎకరాకు రోడ్లు పోను 15 ప్లాట్లు తయారవుతాయి. ఒక్కో ప్లాటుకు రూ.7 లక్షల చొప్పున కనీసం రూ. 1కోటి ఆర్జిస్తున్నారు. అంటే ఎలాంటి ఖర్చులు లేకుండా దాదాపు మూడు రెట్లకు పైగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదే మాదిరిగా పాత మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్, అండాళమ్మ కాలనీ, రాజీవ్‌నగర్, తిలక్‌నగర్ ఏరియాల్లో అక్రమ వెంచర్లు పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి.
Tags: OK with notices on irregularities…
