పాతబస్తి సీఎం ఆసదుద్దీన్ ఓవైసీ

Date:18/10/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ లో నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె  14 రోజుకు చేరుకున్నది. సమ్మెపై  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేసారు. ఇప్పుడు తెలంగాణకు  ఇద్దరు ముఖ్యమంత్రులు వున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పాత బస్తీ ముఖ్యమంత్రి అసదుద్దీన్ ఓవైసీ అని అయన అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు నోరు తెరచి మాట్లాడడి ఇప్పటికైన ప్రజలకు ఎవరు ఏంటో అవగాహన వచ్చేసిందని విహెచ్ అన్నారు. శుక్రవారం నాడు పాత బస్తీ ఫలక్ నుమా, ఫారూఖ్ నగర్ బస్సు డిపో ఆర్టీసీ కార్మికుల ను కలిసిన కాంగ్రెస్ మాజీ  రాజ్య సభ సభ్యుడు వి హనుమంతత రావు  కలిసి వారికి మద్దతు  తెలిపి వారితో కలిసి బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు.  ఫలక్ నుమా డిపో నుండి బయలు దేరి లాల్ దర్వాజా, లాల్ దర్వాజా చౌరస్తా, నుండి ఫలక్ నుమా వరకునిర్వహించారు.

 

 

 

అయ్యా కేసీఆర్ ఇప్పటికయినా నోరు తెరిచి ఆర్టీసీ కార్మికులను రక్షించండి. ఇప్పటి వరకు ఐదుగురు  కార్మికులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.  గవర్నర్  స్పందిస్తున్నా కానీ కేసీఆర్  స్పందించడం లేదని అన్నారు. కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరు ఇద్దరే అని అన్నారు. శనివారం  రాష్ట్రం మొత్తం బంద్ నిర్వహిస్తామని అన్నారు.

బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలి: ఆళ్ల

 

Tags: Old Basti CM Asaduddin Owaisi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *