పాత దోస్తీయే..ఎంపి మిథున్ రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ.మిథున్ రెడ్డి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపధ్యంలో అయన పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. కొత్తగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసిందేమి లేదు. 2014లో చంద్రబాబు ఏ తప్పు చేసిన నన్ను నిలదీయండి.ఈరోజు ఆయనను ప్రశ్నించే పాపాన పోలేదు. 2019లో కాపుల ఓట్లు టీడీపీ కు పడవనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ను వేరుగా చంద్రబాబు పోటీ చేయించాడని అన్నారు. కొత్తగా పొత్తులు కుదిరే విషయం ఏమి లేదు. పవన్ కళ్యాణ్ ఎంత వీలైతే అంత వరకు చంద్రబాబు నాయుడు కోసం పని చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి అవుతాను అనే వ్యక్తి ఈరోజు 10.సీట్లకో 15.సీట్లకో అమ్ముడు పోయాడు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే విదంగా ఉంటే పరిస్థితి వేరే విదంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కు ముఖ్యమంత్రి చేసేకి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు. సినిమాలు వేరు నిజ జీవితంలో ప్రజలు ఆశించేది వేరు. దేశంలోనే నా పనితీరు చూసి ఓటు వేయమంటున్న ఒకేఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో సమావేశానికి అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు అనడం మంచి పద్ధతి కాదు. కుప్పంలో టిడిపి కార్యకర్తలు దొంగ కట్లు కట్టుకొని హాస్పిటల్ లో చేరారు. చంద్రబాబు నాయుడు ఫోటోలు తీసుకొని వెళ్లిన మరుక్షణం హాస్పిటల్ నుంచి వారంతా ఇండ్లకు వెళ్లారని అన్నారు. ఏ మీటింగ్లో చూసిన ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అంటున్నారని అయన ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే రాష్ట్రంలో వీళ్లు ప్రజల్లో తిరుగుతారా అని అన్నారు.
Tags: Old friend.. MP Mithun Reddy

