రోడ్డు ప్రమాదం లో వృద్దురాలు మృతి

విశాఖపట్నం ముచ్చట్లు:


జ్ఞానాపురం రైల్వేస్టేషనప్ దగ్గర శుక్రవారం  ఉదయం సుమారు 06:00గం సమయంలో 70 సంవత్సరాలు వయసు గల  వృద్దురాలు జ్ఞానాపురం రోడ్డు దాటుతుండగా ఘోరరోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందింది.  వివరాల్లోకి వెళ్లితే  రెండు రోజుల క్రితం జ్ఞానపురంలో వున్నా తన  బంధువులు ఇంటికి వచ్చి తిరిగి ఈ రోజు ఉదయం అల్లిపురంలో తన నివాసం కు వెళ్లే క్రమంలో సుమారు ఉదయం 06:00గంటలకు సమయంలో జ్ఞానాపురం  రైల్వేస్టేషన్  వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన బంధువులను,   అక్కడ  ఉన్న స్థానికులు ను ఒక్కసారి గా భయభ్రాంతులు కు గురిచేసింది. బంధువులు కంచరపాలెం ఐదవ  టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలముకు పోలీసులు వచ్చి మృతి చెందిన వృద్దురాలు మృతదేహాన్ని కేజీహెచ్  మార్చురీకు పంపించారు.  లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులో కి తీసుకొన్ని విచారణ చేపట్టారు.

 

Tags: Old woman died in a road accident

Leave A Reply

Your email address will not be published.