టిప్పర్ ఢీకొని వృద్దురాలు మృతి
నూజివీడు ముచ్చట్లు:
ఏలూరు జిల్లానూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కాట్రేనిపాడు హరిజనవాడకు చెందిన దాకవరపు ఏసుమరియా (వయసు 61) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె తల, మొండెం వేరయ్యాయి. కాట్రేనిపాడు నుండి హనుమాన్ జంక్షన్ వైపు వెళుతుండగా గోపవరం వైపు వెళుతున్న టిప్పర్ బైక్ పైకి దూసుకు వెళ్లడంతో వాహన చోదకుడు తప్పించుకోగా, వృద్దురాలి లారీ కింద పడి దుర్మరణం చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలం నుండి వాహనాన్ని డ్రైవర్ వదిలి పారిపోయాడు. ముసునూరు ఎస్ఐ కుటుంబరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Old woman dies after being hit by a tipper

