నీటికుంటలో పడి వృద్దుడి మృతి

Date:09/11/2019

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని రాయలపేటకు చెందిన చిలకపుత్తూరు గ్రామంలో ప్రమాద వశాత్తూ వృద్దుడు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై లోకేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలు.. చిలకపుత్తూరు గ్రామానికి చెందిన గోపాలక్రిష్ణప్ప(65) దాసనంపల్లె వద్ద గల తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న కుప్పన వడ్డులో స్నానం చేయడానికి దిగి ప్రమాద వశాత్తూ నీటిలో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారని తెలిపారు. మృతుడికి ఈత రాకపోవడంతోనే మృతిచెంది ఉంటాడని పిర్యాదు లో పేర్కొన్నారని ఎస్సై తెలిపారు. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి వుంది.

 

వదినతో అక్రమ సంబంధం

 

Tags:Old woman dies in the water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *