Natyam ad

నగల కోసం వృద్దురాలి హత్య

నెల్లూరు ముచ్చట్లు:

ఓ వృద్దు రాలిని హతమార్చి బంగారు నగలు ఎత్తుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగం మండలం తలుపూరు పాడు గ్రామంలో మస్తాన్, మస్తాన్ బి అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వృద్ధుల వద్ద బంగారు నగలు ఉన్నాయని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఆన్సర్ అనే వ్యక్తి ఎలాగైనా వాటిని కొట్టాలని పథకం పన్నాడు. మస్తాన్ కు పూల్ గా మద్యం తాగించాడు. తరువాత ఆన్సర్ ఇంట్లోకి వెళ్లి  మస్తాన్ బి నిద్రపోతుండగా ముఖం పైన దిండు తో నొక్కి అతి దారుణంగా హత్య చేసాడు. ఇంటిలోని నగలు మొత్తం ఎత్తుకెళ్లిపోయాడు. సాధారణం మరణం అనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మస్తాన్ బి అంత్య క్రియలు పూర్తి చేసేసారు. ఈ ఘటన శనివారం జరిగింది.  తరువాత మస్తాన్ కి అన్సర్ పైన అనుమానం రావడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆన్సర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వృద్ధురాలిది హత్యగానే నిర్ధారించారు.

 

Tags: Old woman killed for jewelry

Post Midle
Post Midle