ఆర్ ఆర్ ఆర్ లో ఒలివీయా

Date:20/11/2019

ముంబై ముచ్చట్లు:

ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు అప్ డేట్స్ బయటకు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించే భామ ఎవరనేది చిత్రయూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ కు జోడీగా థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలీవియా మొర్రిస్ ఎంపికైందని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఒలీవియా ఈ సినిమాలో జెన్నిఫర్ పాత్రలో నటిస్తోంది.మరోవైపు ఈ చిత్రంలో విలన్లుగా ఐరిష్ యాక్టర్ అయిన రే స్టీవెన్ సన్, ఎలిసన్ డూడీల ను చిత్ర బృందం ఓకే చేసినట్లు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ట్వి్ట్టర్ ద్వారా ప్రకటించింది. రే స్టీవెన్ సన్ స్కాట్ పాత్రలో కనిపించనుండగా..ఎలిసన్ డూడీ లేడీ స్కాట్ గా కనిపించనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

 

ఏపీలొ ఇంగ్లీషు మీడియం స్కూళ్లు..నోటిఫికేషన్

 

Tags:Olivia in RRR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *