Natyam ad

13న పులివెందులకు ఏపీ  సీఎం జగన్ దంపతులు

– రేపు ఓటు వేసేందుకు సిద్దం.

కడప  ముచ్చట్లు:

Post Midle

ఏపీ ముఖ్యమంత్రి వైఎసన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులకు వెళ్లనున్నారు. మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈరోజు బయల్దేరనున్నారు.సాయత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పులివెందులు చేరుకుంటారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ జరిగేందుకు ముందు సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వారు ఉండేందుకు అవకాశం ఉండదు.

 

దీని కారణంగా ఇవాళ, రేపు రెండ్రోజులపాటు పులివెందులలోనే ఉంటారు. ఆయనతోపాటు సతీమణి వైఎస్ భారతి కూడా పులివెందుల వెళ్లనున్నారు. రాత్రి పులివెందులలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు పార్టీ నాయకులు, పోలీసులు. ఓవైపు పోలింగ్.. మరోవైపు సీఎం వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ. సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. మరోవైపు వర్షం కూడా వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలు తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో భద్రపరుస్తున్నారు.

 

Tags: On 13th AP CM Jagan’s couple went to Pulivendulu

Post Midle