21 న సూళ్లూరుపేట లో సీఎం పర్యటన ముందస్తు భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన.
తిరుపతి ముచ్చట్లు:
ప్రతిపాదిత సభా ప్రాంగణం, ప్రతిపాదిత హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించి అందుకు అనువైన రోడ్ మ్యాప్ ను గురించి అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్. ఈనెల 21 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో పర్యటించనున్న నేపథ్యంలో తీసుకోవలసిన ముందస్తు భద్రతాపరమైన ఏర్పాట్లను గురించి ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి., భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి., ఎమ్మెల్యే కే.సంజీవయ్య, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి., వారితో కలసి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., పర్యవేక్షించారు. అలాగే ప్రతిపాదిత బహిరంగ సభ ప్రాంగణం, ప్రతిపాదిత హెలిపాడ్ ప్రాంతాల వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడ ముందస్తుగా తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలను గురించి వారితో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటించబోయే రోడ్ మ్యాప్ గురించి అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సూళ్లూరుపేట పట్టణానికి వస్తున్నందున పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా హెలిపాడ్ చుట్టూ బ్యారికెట్ల నిర్మాణం చేపట్టాలని, సభా ప్రాంగణం వరకు చేరుకునే రోడ్ల వెంబడి ఇరువైపులా కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్. ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ బాలాజీ, అదనపు ఎస్పీ శాంతి భద్రత కులశేఖర్, డిఎస్పీలు గిరిధర ఎస్బి, రాజగోపాల్ రెడ్డి నాయుడుపేట, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags: On 21st CM’s visit to Sullurpet on field level observation of security measures.
