Natyam ad

డిసెంబరు 9న పిసిసి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం-నీలి శ్రీనివాసరావు

కడప ముచ్చట్లు:

 

కడప కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీటింగ్ లో మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన పిసిసి నూతన అధ్యక్షుడిగా ఎక్స్ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు గారు విజయవాడలో బెంజ్ సర్కిల్ లోని వేదిక కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు తెలిపారు.కాంగ్రెస్ కడప జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షుడిగా, డాక్టర్ నరేడ్డి తులసి రెడ్డి పిసిసి మీడియా చైర్మన్గా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లు, ఇంకా అనేకమంది ప్రమాణ స్వీకారం చేయనున్నారని, తెలిపారు.

 

 

 

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కడప జిల్లా నుంచి రాష్ట్ర నేతలు, జిల్లా కమిటీ, నగర కమిటీ, మండల కమిటీ, వివిధ అనుబంధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీ విభాగాలు, విద్యార్థి ,యువత, మహిళా విభాగం, సేవాదళ్ ,లేబర్ సెల్, కిసాన్ సెల్, లీగల్ సెల్, మానవ హక్కుల విభాగం తదితర విభాగాల నుంచి భారీ ఎత్తున శ్రేణులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
2024లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, కేంద్రంలోనూ ,రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, దీనికి చరమ గీతం పాడాలంటే అది కేవలం రాహుల్ గాంధీ నేతృతంలోని కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అని ఆయన అన్నారు.

 

 

Post Midle

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తో పాటు నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, రాష్ట్ర ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మల్లెం విజయభాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్యామలాదేవి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ బాబు, జిల్లా కార్యదర్శి సూర్యుడు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.

 

Tags: On December 9, PCC’s new president took oath-Neeli Srinivasa Rao332

Post Midle