ఫిబ్ర‌వరి 22న “క్రేజీ కేజీ ఫీలింగ్” గ్రాండ్ విడుద‌ల‌

On February 22, "Crazy Cage Feeling" was released as grand
Date:11/02/2019
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. సంజయ్ కార్తీక్ దర్శకుడు.  విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే లెంగ్తీ క్యారెక్టర్లో కడుపుబ్బ నవ్విస్తాడు. ఈ సినిమాకు ఆయన మెయిన్ పిల్లర్ గా నిలిచారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ సినిమా నిర్మించాము. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం.
ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ ద్వారా బాపిరాజు గారు విడుదల చేస్తున్నారు. అని అన్నారు. నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్  గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు. వెన్నెల కిషోర్ గారి కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. కథ బాగా నచ్చడంతో  ఆయన చాలా సపోర్ట్ చేశారు. భీమ్స్ మంచి పాటలందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవ‌రి 22న విడుద‌ల చేయ‌నున్నాము. ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ ద్వారా బాపిరాజు గారు విడుద‌ల చేస్తున్నారు. అని అన్నారు.
Tags:On February 22, “Crazy Cage Feeling” was released as grand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *