ర‌ఘురామ‌కృష్ణంరాజు పై…పెద్ద ఎత్తున చ‌ర్చ

Date:26/10/2020

ఏలూరు ముచ్చట్లు:

మాంచి క‌సి మీదున్నప్పుడు.. కోపం మీదున్నప్పుడు ఏం చేసినా.. పాజిటివ్ రిసీవే ఉంటుంది. కానీ, వేడిత‌గ్గాక ఏం చేస్తే మాత్రం ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? “-ఇదీ ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ – ఆ పార్టీ రెబెల్ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజు పై ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న వ్యాఖ్య. రెండు రోజులుగా ఇంత‌కు మించిన వ్యాఖ్యలే నియోజ‌క‌వ‌ర్గంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకిలా నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ వినిపిస్తోంది ? అని ఆరా తీస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది. వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విష‌యంలో జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్యలూ ప్రత్యక్షంగా తీసుకోలేదు.ర‌ఘురామ‌కృష్ణంరాజుపై ప‌రోక్ష దాడే చేయించారు. ఇక‌, ఆయ‌న‌పై అన‌ర్హత వేటు వేయించేందుకు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది పెండింగ్‌లో ఉంది. అయితే.. రెబెల్‌గా మారిన ర‌ఘురామ‌కృష్ణంరాజు మాత్రం రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు సీఎం అంటే.. ప‌రోక్షంగా వ్యాఖ్యలు చేసిన ఆయ‌న ఇప్పుడు నేరుగా పేరు పెట్టే దులిపేస్తున్నారు. `న‌న్ను ఏమీ పీక‌లేరు!` అని వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ఇటీవ‌ల న్యాయ‌వ్యవ‌స్థ విష‌యంలో జ‌గ‌న్ దూకుడును ప్రస్తావిస్తూ మ‌రింత వ్యతిరేకంగా ర‌ఘురామ ప్రచారం చేస్తున్నారు.

 

రాష్ట్రంలో ఆర్టిక‌ల్ 356 వ‌చ్చే ప‌రిస్థితి ఉంద‌ని, ఆదిశ‌గా పావులు క‌దుపుతున్నాయ‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు బాంబు పేల్చారు. ఇది.. వైసీపీలోనే తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారి.. నేత‌ల్లో ఆత్మస్థైర్యంపై దెబ్బప‌డింది. అంతేకాదు, తాను జ‌గ‌న్‌పై రెండు ల‌క్షల ఓట్ల మెజారితో గెలుపు గుర్రం ఎక్కుతానంటూ.. తీవ్ర వ్యాఖ్యలుచేశారు. దీంతో ఇక‌, ఇన్నాళ్లు.. ఉపేక్షించాం.. ఇక పార్టీ నుంచి గెంటేయ‌డ‌మే బెస్ట్‌! అని వైసీపీ నేత‌లు నిర్ణయించుకున్నార‌ని.. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ కూడా ఇదే ఆలోచ‌న చేస్తున్నార‌ని ప్రచారం చేస్తున్నారు.

 

 

 

ఈ విషయంపైనే న‌ర‌సాపురం పార్లమెంటు ప‌రిధిలో పెద్ద ఎత్తున చ‌ర్చసాగుతోంది.ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణంరాజును గెంటేసినా.. ఆయ‌న‌కే ప్రయోజ‌నం. ఆయ‌న‌కు రావాల్సిన పాపులారిటీ వ‌చ్చేసింది. సింప‌తీని సంపాయించుకున్నారు. ఇప్పుడు గెంటేస్తే.. వైసీపీ మ‌రింత న‌ష్టపోతుంది. వేరే మార్గం ఏదైనా ఉంటే చూడాలి!!“ అని న‌ర‌సాపురానికి చెందిన వైసీపీ సానుభూతి ప‌రులు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే.. స‌మ‌యానికి స‌రైన నిర్ణయం తీసుకుని అప్పట్లోనే గెంటేసి ఉంటే.. ఇప్పుడు ఈ తిప్పలు ఎదుర‌య్యేవి కావు క‌దా.. అనేది వీరి భావ‌న‌. అందుకే జ‌గ‌న్ అలా చేస్తే.. రాజుగారే బ‌తికి పోతారు. అంటున్నారు. నిజ‌మేనా…!

నిరక్ష్యరాసురాలైన తల్లితో కౌన్సిలింగ్‌కు వచ్చిన బిఎస్‌సి విద్యార్థి

Tags:On Raghuram Krishna Raju … Large scale discussion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *