Natyam ad

ఈ నెల 11 న నాలుగవ విడత జగనన్న తోడు లబ్ది 

– తాడేపల్లె నుండి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

– జిల్లాలో 31,649 మంది లబ్దిదారులకు రూ.84,80,447 లు లబ్ది

– జిల్లా కలెక్టర్

 

చిత్తూరు  ముచ్చట్లు :

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న  4 వ విడత జగనన్న తోడు పథకాన్ని ఉ.11.00 గం.లకు తాడేపల్లె నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి గౌ. జిల్లా మంత్రులు,గౌ. శాసన సభ్యులు, లబ్దిదారులు పాల్గొంటారని తెలిపారు.   వీధి విక్రయదారులు, కాయగూరల విక్రయదారులు, తదితర చిరు వ్యాపారులు రుణాల కొరకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలను లబ్దిదారులకు అందించడం జరుగుతున్నదని, ఈ రుణాలను క్రమం తప్పకుండా బ్యాంకులకు తిరిగి చెల్లించిన వారికి అందుకు సంబంధించిన పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.  4 వ విడత జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని 21,866 మంది లబ్దిదారులకు రూ.59,897,00, పట్టణ ప్రాంతాలలోని 9,783 మంది లబ్దిదారులకు రూ.24,90,721 మొత్తం 31,649 మొత్తం  లబ్దిదారులకు రూ.84,80,447 లు లబ్ది చేకూరనున్నదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

 

Tags; On the 11th of this month, the fourth installment will be released with Jagananna Todu