21న కాంగ్రెస్ చలో విజయవాడ
కడప ముచ్చట్లు:
నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించి తప్పుడు రాతలతో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఈడి నోటీసులు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఈనెల 21వ తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించనున్నట్లు, కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తెలిపారు.సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బిజెపి దుష్ట బుద్ధితో గతంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అనేకసార్లు ఈడి ముందుకు హాజరు పరిచి, గంటల తరబడి విచారణ చేసిన విషయం గుర్తు చేశారు.21వ తేదీ సోనియా గాంధీ ని ఈడి ముందు హాజరు కావాలని నోటీసులు పంపించడం, దేశంలో ప్రతిపక్షాల ఉనికిని దెబ్బతీయటమే అన్నారు.
రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తే అది జరగని పని అన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేతలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.నల్ల రైతు చట్టాలతో రైతులని ఇబ్బంది పెట్టిందన్నారం
బిజెపి కులాలు ,మతాల పేరుతో దేశాన్ని విభజిస్తుంటే,కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహిస్తారన్నారు
కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం విజయభాస్కర్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, కార్యదర్శి సుబ్బారెడ్డి, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు పాలగిరి శివ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోర్ల శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సాదికలి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆనంద్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు వేణుగోపాల్, సూర్యుడు పాల్గొన్నారు.
Tags: On the 21st, the Congress came to Vijayawada