ఈ నెల 7 న వేంకటేశ్వర పశువైద్య  విశ్వ విద్యాలయ  11 వ స్నాతకోత్సవం  వి.సి. పద్మనాభ రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయ  11 వ స్నాతకోత్సవం  ఈ నెల 7 న పశువైద్య కళాశాల , ఆడిటోరియంలో ఉదయం. 10-00 గం లకు నిర్వహించనున్నట్లు  విద్యాలయ ఉపకులపతి డా. వి . పద్మనాభ రెడ్డి అన్నారు.  . మంగళవారం ఉదయం స్థానిక విశ్వ విద్యాలయ సమావేశ మందిరంలో 11 వ స్నాతకోత్సవం నిర్వహణ పై విసి పత్రికా విలేఖరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ పశు సంవర్ధక , పాల సాంకేతిక రంగము మరియు మత్స్య సంపద పెరుగుదలకు తద్వారా రైతుల అభ్యున్నతికి, ఆర్ధిక అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి  డా. వై.యస్ . రాజశేఖర రెడ్డి గారి కృషితో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం  2005 వ సంవత్సరములో రూపుదిద్దుకున్నదని అన్నారు. ఈ విశ్వ విద్యాలయ పరిధిలో 30 సంస్థలు మరియు అనుబంధముగా 22 సంస్థలు మొత్తము 52 సంస్థలు బోధన , శిక్షణ , పరిశోధన మరియు విస్తరణ రంగాలలో నెలకొల్పబడి గణనీయమైన సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వము , భారత వ్యవసాయ పరిశోధనా మండలి , యు.జి.సి. మరియు ఇతర సంస్థల మన్ననలను పొందుతూ పురోగమిస్తున్నది . విశ్వ విద్యాలయ పరిధిలోని 3 పశువైద్య కళాశాలలు , 2 డైరీ టెక్నాలజీ కళాశాలలు , 1 మత్స్య కళాశాలకు చెందిన 281 మంది  యు.జి. , 96 మంది పి.జి. మరియు 15 మందికి పిహెచ్.డి మొత్తము 392 మంది

 

 

 

విద్యార్ధినీ విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. కులపతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ. బిశ్వ భూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారని , ముఖ్య అతిథిగా తమిళనాడు యానిమల్ సైన్స్ విశ్వవిద్యాలయము ఉపకులపతి ప్రొఫెసర్ . డా.కె.యన్ . సెల్వకుమార్ పాల్గొననున్నారని తెలిపారు . విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు , అకడమిక్ కౌన్సిల్ సభ్యులు , విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు 37 స్వర్ణ పతకాలు , 2 రజత పతకాలు , 1 నగదు బహుమతి మొత్తము 40 పతకాలను అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు విశ్వ విద్యాలయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారములను ప్రధానం చేయడం జరుగుతుందని  వివరించారు. టిటిడి సహకారంతో దేశీయ ఆవుల పాల ఉత్పత్తి కనీసం 10 శాతం పెంపు లక్ష్యంగా, తిరుమల శ్రీవారి నైవేద్యంలో ఉపయోగించే రోజువారి 70 కిలోల  వెన్న , నెయ్యి  వంటివి, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతపై విశ్వ విద్యాలయం సహకారం అందిస్తున్నదని వివరించారు.ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డా.ఎ.రవి, డీన్ డా.కె.సంజన్ రావ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.జె.సురేష్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ జి.వెంకట నాయుడు, అసిస్టెంట్ డీన్ కె.ఆది లక్ష్మి, డైరీ డీన్ నాగేశ్వర్ రావు, ప్రొఫెసర్ లు బి.ఆర్.నాయుడు, బి.శ్రీనివాసులు, జగపతి, రాంబాబు నాయక్ , మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Tags: On the 7th of this month, the 11th graduation ceremony of Venkateswara Veterinary Vishwa Vidyalaya V.C. Padmanabha Reddy

Leave A Reply

Your email address will not be published.