కౌంటింగ్ రోజున   అభ్యర్థులు కమిషన్ నిబంధనలను పాటించాలి

-పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా పాలనాధికారి  శ్రీదేవసేన

Date:21/05/2019

 

పెద్దపల్లి  ముచ్చట్లు:

పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా అభ్యర్థులు కమిషన్ నిబంధనలను పాటిస్తూ సజావుగా కౌంటింగ్ జరిగేందుకు సహకరించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన  కోరారు.  కౌంటింగ్ నిర్వహణ అంశం పై ఆమె  జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల పక్షాలతో  కలెక్టర్ మంగళవారం  సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో  కలెక్టర్ మాట్లాడుతూ  మే 23,2019న  నిర్వహించే కౌంటింగ్ కు అన్ని ఎర్పాట్లను  కట్టుదిట్టంగా  పూర్తి చేసామని, ఉదయం 8 గంటలకు  కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని  తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద  సిబ్బందికి,  కౌంటింగ్ ఎజేంట్లకు వేర్వేరు  ఎంట్రీలను  ఎర్పాటు చేసామని, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయిన  తరువాత మొదట  పోస్టల్ బ్యాలేట్ ఒట్లను, ఈటిపిబి ఒట్లను లెక్కించడం జరుగుతుందని  తెలిపారు.  పోస్టల్ బ్యాలేట్ ఒట్లలో కొన్నీ ఒట్లను తిరస్కరించడానికి గల కారణాలను  కలెక్టర్ వివరించారు.  ఉదయం 8.30 గంటలకు ఈవిఎం యంత్రాల కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుందని, దీనికి ముందు సెక్షన్ 138 గురించి ఎజెంట్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో  7 అసెంబ్లీ  సెగ్మెంట్లు ఉన్నాయని,  ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కౌంటింగ్  హల్ లో 14 టేబుళ్లను ఎర్పాటు చేసామని,  పెద్దపల్లి , మంథని  అసెంబ్లీ  సెగ్మెంట్లలో 21 రౌండ్లు , చెన్నూరు , బెల్లంపల్లి  16 రౌండ్లు, మంచిర్యాల, ధర్మపురి 20 రౌండ్లు, రామగుండం 19 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ వివరించారు.  కౌంటింగ్ కేంద్రం వద్ద వివిప్యాట్లను లెక్కించడానికి వివిప్యాట్  కౌంటింగ్ బూత్ ను ఎర్పాటు చేసామని తెలిపారు.

 

 

 

 

 

పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎం యంత్రాలను స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చడం జరిగిందని, దానికి మూడంచెల భద్రత వ్యవస్థతో  పరిరక్షించామని అన్నారు.   కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు  కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లను   టేబుళ్ల వారిగా ర్యాండమైజ్ చేయడం జరుగుతుందని,  కౌంటింగ్ కేంద్రం 100 మీటర్ల పరిసరాలో మీడియా వారు సైతం ఎలాంటి  ఇంటర్వ్యూలు నిర్వహించడానికి వీలు లేదని, కౌంటింగ్ హల్ లోపల ఎలాంటి వీడియాలో తీయడానికి వీలు లేదని అన్నారు.  కౌంటింగ్ కేంద్రానికి బయటి నుండి ఎలాంటి తినుబండారాలు తీసుకొని రాకుడదని, అవసరమైన మేర  ఏజేంట్లకు  టీ, స్నాక్స్ సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నిబంధనలను పాటిస్తూ  సజావుగా జరగడంలో అందరు సహకరించాలని  కలెక్టర్ కోరారు. జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి,వివిధ రాజకీయ పార్టీ, అభ్యర్థుల ప్రతినిధులు,  సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

 

ఒట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలి 

Tags: On the counting day candidates must follow the rules of the Commission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *