మొదటి రోజు ఒక నామినేషన్  దాఖలు 

Date:18/03/2019
వరంగల్ అర్బన్ ముచ్చట్లు:
వరంగల్ లోక్ సభ ఎన్నికలకు మొదటి రోజు సోమవారం  ఒక నామినేషన్  దాఖలు  అయినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ తెలిపారు. బరిగల శివ, బహుజన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. ఈ నెల 25 సాయంత్రం 3.00 గం లోపు పార్టీ బి-ఫారాన్ని , బ్యాంక్ ఖాతా వివరాలను, అఫిడవిట్ ను, నేరచరిత వివరాలను అందజేయాలని బరిగల శివకు రిటర్నింగ్ అధికారి  నోటీస జారీ చేశారు. అభ్యర్ధుల నామినేషన్ పతాలను, అఫిడవిట్, ఫారం-26 ద్వారా ఇచ్చిన భార్య భర్త , అభ్యర్ధి పై ఆధారపడి జీవిస్తున్న వారి ఆస్తులు, ఆధాయపు పన్ను చెల్లింపు వివరాలు, క్రిమినల్ కేసుల వివరాల ను ప్రజలకు అందుబాటులో వుండేవిధంగా ఈ సిఐ వెబ్ సైట్ లో వుంచనున్నట్టు తెలిపారు. అలాగే వాటి ప్రతులను రిటర్నింగ్ అధికారి ఛాంబర్ ముందు, కలెక్టరేట్ కాంప్లెక్స్ లో వున్న మీడియా సెంటర్ లో నోటిసు బోర్డలో డిస్ ప్లే చేయనున్నట్లు తెలిపారు.
నామినేషన్ల స్వీకరణకు పటిష్టమైన బారీకేడింగ్ , పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు  ప్రశాంత్ జె.పాటిల్ ఈ సందర్భంగా తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్ ముందు  రిసెప్షన్  సెల్ ను ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. వరంగల్ లోక్ సభ  పరిధిలోని ఏడు శాసనపభ స్ధానాలోవున్న ఓటరరు జాబితాలను అందుబాటులో వుంచినట్లు తెలిపారు. రిసోప్షన్ సెల్ ద్వారా   అభ్యర్ధులకు నామినేషన్ పత్రం పూర్తిచేసేందుకు అవసరమైన సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్ధితో  పాటు 5 గురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే అభ్యర్ధులు వాహనాలు, ఇతరులను గేటు బయట నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆయా తీదీలలో ఉదయం 11. గం నుండి సాయత్రం 3.00 గం వరకు నామినేషన్ పత్రల ను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో వుంచుకోవాలని తెలిపారు. నామినేషన్ పత్రాలు ను రిసెప్షన్ సెల్ నుండి ముందుగా తీసుకుని, అవసరమైన పత్రలను జతపరచి. సక్రమంగా పూర్తి చేసుకోవాలని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
Tags:On the first day filed a nomination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *