స్వరూపానందేంద్ర స్వామీజీ చేతుల మీద…

On the hands of the Swarnapandendra Swamiji ...

On the hands of the Swarnapandendra Swamiji ...

-బాలస్వామికి శారదా పీఠం ఉత్తర పథం
– విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవం
– కృష్ణానదీ తీరంలో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక హోరు
– జగన్మోహన్ రెడ్డి, కేసీయార్, నవీన్ పట్నాయక్…  ముగ్గురు సీఎంల రాక

 

Date:14/06/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆది శంకరాచార్యుల మార్గంలో పయనిస్తూ, అద్వైతాన్ని బోధిస్తూ… ఆధ్యాత్మికతను వ్యాప్తి చేస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ నేడు కృష్ణా నదీ తీరానికి చేరారు. శారదా పీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాన్ని చేపట్టారు. విజయవాడలోని కృష్ణా నది కరకట్టపై శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను సిమ్స్ డైరెక్టర్ భరత్ రెడ్డి, డాక్టర్ బి.శివ శిరీషలు పర్యవేక్షిస్తున్నారు.  ఆఖరి రోజు  17న బాల స్వామి వారికి యోగ పట్టా అనుగ్రహించే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణా సీఎం కేసీయార్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ హాజరవుతున్నారు. దీని కోసం అమరావతి కరకట్ట పై గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఏర్పాట్లను దేవాదయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగిరమేష్ పరిశీలించారు. గుంటూరు రేంజి ఐ.జి. రాజీవ్ కుమార్ మీనా, ఎస్పీ రాజశేఖర్ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.

ఘనంగా రాజన్న బడిబాట అక్షరాభ్యాసం

 

Tags: On the hands of the Swarnapandendra Swamiji …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *