ఓ పక్క తెగులు.. మరో వైపు జిన్నింగ్ కష్టాలు

On the other side ginning difficulties

On the other side ginning difficulties

Date:14/09/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో తెల్లబంగారం తెగుళ్ల బారిన పడింది. గులాబీ రంగు పురుగు, ఆకుముడత, పిండినల్లి, పేను, రసం పీల్చే పచ్చ, తెల్లదోమ, తెగులు సోకి ఎర్రబారి పత్తి పైరు ఎదుగుదల తగ్గుముఖం పడుతున్న తీరును చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే పత్తికి మద్దతు ధర పెరిగిందని సంతోషపడ్డ అన్నదాతలను అధికవర్షాలు ముంచాయి. బీటీ పత్తికి సైతం తెగులు సోకడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు.
అన్ని రకాల వాతావరణానికి బీటీ అనుకూలం అని చెబుతున్నప్పటికీ తెగులు సోకి మొక్కలు చనిపోతున్నాయి. పైరుకు ఎలాంటి మందులు వాడాలో తెలియక మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు ఖర్చులు పెరుగుతుండగా భారీగా పంట దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు.పత్తి కొనుగోళ్ల సీజన్‌ సమీపిస్తున్నా సీసీఐకి జిన్నింగ్‌ మిల్లులు అద్దెకు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3.47 లక్షల హెక్టార్లలో పత్తి పంట గతేడాది సాగైంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పత్తిపంట సాగవుతోంది.
సుమారు 50 నుంచి 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది పత్తి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర రూ.5450కి పెంచింది. దీంతో ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జిన్నింగ్‌ మిల్లుల యజమానులు టెండర్లకు ముందుకు వస్తేనే కొనుగోళ్లలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్న పక్షంలోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయానికి ఎలాంటి ప్రతిష్టంభన ఉండదు.
పత్తిని జిన్నింగ్‌ చేసి దూదిని విడదీసి ఇచ్చే విషయంలో సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల మధ్య కొత్త నిబంధనల లొల్లి నెలకొనగా గత నెల ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి 33 కిలోల దూది ఇవ్వాలనే నిబంధనను 31 కిలోలకు తగ్గించింది. ప్రతి ఏడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తి నిల్వలను ఉంచడంతోపాటు జిన్నింగ్‌ చేసి దూదిని విడదీసి బేళ్లుగా తయారు చేసేందుకు జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకుటుంది. ఈ అద్దె కోసం సీసీఐ కొన్ని నిబంధనలు విధించి మిల్లుల యజమానుల నుంచి టెండర్ల ద్వారా కొటేషన్లను ఆహ్వానిస్తుంది.
ఈ ఏడాది సీసీఐ సీఎండీ కొత్త నిబంధనలను తీసుకురావడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. క్వింటాలు పత్తిని మిల్లులో జన్నింగ్‌ చేసినప్పుడు తప్పనిసరిగా 33 కిలోల దూదిని తమకు అప్పగించాలని సీసీఐ నిబంధన పెట్టింది. గతంలో ఇది 30.5 కిలోలే ఉండేది. దీనిపై మిల్లుల యజమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వం 31 కిలోలకు దిగి వచ్చింది.తద్వారా సమస్య పరిష్కారం అయిందన్న అభిప్రాయం ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది. ఇప్పటికీ జిన్నింగ్‌ల అద్దె విషయంలో టెండర్లు పూర్తి కాకపోవడం సమస్యను తేటతెల్లం చేస్తోంది. సీసీఐ నాలుగోసారి టెండర్లను పిలిచింది. ఈ నెల 14 వరకు జన్నింగ్‌ మిల్లుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
17న టెండర్లను తెరవనుంది. అప్పటికీ పరిస్థితి తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోలుకు సంబంధించి సీసీఐ 23 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికీ టెండర్లు పూర్తి కాకపోవడంతో కొనుగోళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో దసరా నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండగా ఇప్పటికీ జిన్నింగ్‌ మిల్లుల అద్దె వ్యవహారం తేలకపోవడం పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన తేటతెల్లం చేస్తోంది.మరో నిబంధన పత్తిని జన్నింగ్‌ చేసిన తర్వాత వచ్చే దూది నుంచి బేళ్లు తయారు చేయగా, అందులో 2 శాతం వ్యర్థాలు మించరాదని కొత్త నిబంధనను తీసుకవచ్చారు.
సాధారణంగానే జిన్నింగ్‌ చేసిన తర్వాత పత్తిలో 3.5 శాతం వ్యర్థాలు ఉంటాయని అలాంటి పరిస్థితిలో బేళ్లలో రెండు శాతం వ్యర్థాల నిబంధన సరికాదని మిల్లుల యజమానులు వాధించారు. దీన్ని 2.5 శాతానికి సీసీఐ పెంచింది. అదే సమయంలో సీసీఐ పత్తిని జిన్నింగ్‌ కోసం మిల్లులకు పత్తిని ఇచ్చిన తర్వాత తిరిగి బేళ్లను ఇచ్చే క్రమంలో నిబంధనలను మించి తరుగు ఉంటే ఆ భారాన్ని జిన్నింగ్‌ మిల్లులకు మోపడం ద్వారా అసలు వ్యాపారం చేసుకోవ్వని పరిస్థితి ఉందని వాపోతున్నారు. తరుగు 3.25 కిలోల వరకు మినహాయింపును ఇచ్చింది.ఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్‌ యార్డుల పరిధిలో సుమారు 23 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ లీజుకు తీసుకోవడం ద్వారా ఈ వ్యవహారాన్ని నడపాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్లు పిలిచినా వ్యాపారులు ముందుకు రాలేదు. ఇక తాజాగా గత శుక్రవారం నాలుగోసారి టెండర్లను పిలవడం జరిగింది. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగుశాతం విషయంలో సీసీఐ కొంత దిగి వచ్చినప్పటికీ ఇందులో నెలల వారీగా మళ్లీ శాతం హెచ్చింపు ఉందని, అదే విధంగా ఇతర నిబంధనలు కూడా జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగో సారి కూడా టెండర్లు కొలిక్కి వస్తాయో లేదోననే సందిగ్ధం కనిపిస్తోంది.ఈ ఏడాది జూలపల్లి మండలంలో 1872 హెక్టార్ల పత్తిని సాగుచేశారు.
జూన్‌ 11 తేది వరకు విత్తనాలు విత్తారు. మద్దతు ధర రూ.4,320 నుంచి రూ.5,450 వరకు పెరగగా తదనుగుణంగా కౌలు ధరలను పెంచారు. పత్తి ధర పెరిగిందన్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. 45 రోజులకు పూతకు వచ్చి ప్రస్తుతం మొదటి పంట చేతికందాల్సి ఉంది. అయితే అధిక వర్షాలతో వివిధ తెగుళ్లు సోకి మొక్క ఎదుగుదల నిలిచిపోతుండడంతో రైతుల్లో నిరాశ మొదలైంది. వర్షాలకు గడ్డి విపరీతంగా పెరగడంతో రెండుసార్లు తీయాల్సిన కలుపు నాలుగుసార్లు తీయాల్సి వస్తోంది. కూలీ రేటు రూ.150 నుంచి 250 వరకు పెరిగింది.
గతంలో దున్నితే ఎకరాకు రూ.15 వందలు తీసుకోగా ఈ ఏడాది రూ. 18 వందలు తీసుకున్నారు. కాంప్లెక్స్‌ ఎరువు బస్తాకు రూ.1070 ఉండగా రూ.1360కు పెంచారు. పురుగుల మందులు సైతం రూ.వందకు పెరిగాయి. ఖర్చులు పెరిగితే తెగుళ్లు సోకి తగిన దిగుబడి రాకుండా ఉంది. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా నాలుగు క్వింటాళ్లకు మించదని రైతులు దిగులు చెందుతున్నారు.
Tags:On the other side ginning difficulties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *