రైల్వే లో… యూజర్ ఛార్జీలు

Date:18/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

విమానాశ్రయాల్లో మాదిరి రైల్వే స్టేషన్‌లోనూ ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. త్వరలోనే దీనిపై రైల్వే శాఖ ప్రకటన చేయనుంది. దేశంలో కొన్ని ఎంపిక చేసిన పెద్ద రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను రైల్వే శాఖ ఏర్పాటుచేస్తోంది. వీటిని వాడుకునే ప్రయాణికుల నుంచి నామమాత్రంగా ఛార్జీలు వసూలు చేస్తామని రైల్వేబోర్డు ఛైర్మన్‌ వీకేయాదవ్‌ గురువారం తెలిపారు. దేశంలోని పది నుంచి పదిహేనుశాతం స్టేషన్లకే ఈ యూజర్‌ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించి ఆదాయం పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన వివరించారు.నామమాత్రంగా యూజర్ ఛార్జీలను వసూలు చేయనున్నాం.. అన్ని స్టేషన్లకు సంబంధించి యూజర్ ఛార్జీలపై త్వరలోనే నోటిఫికేషన్ వెల్లడిస్తాం.. స్టేషన్ల అభివృద్ధి పూర్తయినప్పుడు రాయితీలు కల్పించిన నగదుతో సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వేశాఖకు చేరుతుంది.. ఇది నామమాత్రం అవుతుంది, కానీ విమానాశ్రయాల మాదిరిగానే ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించాలనుకుంటే యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ముఖ్యం.

 

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.దేశంలోని మొత్తం 7,000 స్టేషన్లలోనూ వీటిని వసూలు చేయం.. కానీ, రాబోయే ఐదేళ్లలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న దాదాపు 10-15 శాతం ప్రధాన స్టేషన్లలో దీనిని వర్తింపజేస్తాం.. ఆ స్టేషన్లనలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు. ప్రైవేటు సంస్థలకు రైళ్లు నడపడానికి అనుమతించడంతో టిక్కెట్ల ధరలు పెరుగుతుందని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైల్వే ఛార్జీలు అధిక రాయితీతో ఉన్నాయని, వాటి హేతుబద్ధీకరణకు ప్రణాళిక ఉందని యాదవ్ చెప్పారు.ప్రయాణీకులు, సరుకు రవాణా ఛార్జీల నిర్ణీత సమయంలో తగ్గుతాయని నేను నమ్ముతున్నాను అని నీతి-ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. 50 పెద్ద స్టేషన్లను మరింత అభివృద్ధి చేసి, దాని ద్వారా ఆదామం ఆర్జించాలని రైల్వే యోచిస్తోంది. పునరాభివృద్ధి చెందిన హబ్‌లను ‘రైల్‌పోలిస్’‌గా పేర్కొన్న రైల్వే.. వీటిని వాణిజ్య అవసరాల కోసం 60 ఏళ్లపాటు లీజుకు ఇస్తుంది.

 

 

 సెస్సు ద్వారా బాదుడు

Tags:On the railways … user charges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *