మూడో రోజు ముద్ద పప్పు బతుకమ్మ

Beatamma festival '.. The festival of the people of Telangana. The great tradition of worshiping the flowers. Telangana culture traditions and lifestyle celebration is a festival

Beatamma festival '.. The festival of the people of Telangana. The great tradition of worshiping the flowers. Telangana culture traditions and lifestyle celebration is a festival

Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
‘బతుకమ్మ పండుగ’.. తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబరు 9న బతుకమ్మ పండుగ మొదలైంది. ఇప్పటికే మొదటి రెండురోజులు ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో మూడోరోజైన ‘ముద్దపప్పు బతుకమ్మ’గా బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి ‘బతుకమ్మ’ ఆడతారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడోరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.
Tags:On the third day the lump of pumpkin buck

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *