Natyam ad

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

ఆలమూరు ముచ్చట్లు:


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల సమీపంలో 216 నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆలమూరు పోలీస్ పెట్రోలింగ్, జాతీయ రహదారుల పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. వారి వివరాలు ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు ఏపి39 డికె 1833 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తిని చొప్పెల్ల లాకులు సమీపంలో వ్యతిరేక దిశలో (రావులపాలెం వైపు నుండి రాజమహేంద్రవరం వైపు) వస్తున్న (ఐసర్ వ్యాన్) వాహనం ఇతని ఢీ కొనడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ద్విచక్ర వాహన ఆధారాలు (రికార్డు) ప్రకారం మృతుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరుతలపూడి గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని యొక్క పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. దీనిపై ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ప్రమాదవ విషయం తెలుసుకున్న టోల్ మేనేజర్ నెహెమియా, హైవే అధికారులు విజయ్, రమేష్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Tags: One died in a road accident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.