Natyam ad

ఒక భర్త..ఇద్దరు భార్యలు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:


మనం సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఓకే హీరో ను ప్రేమించడం చుసే ఉంటాం. కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు హీరో. కానీ నిజ జీవితంలో  ఇద్దరి భామల హీరో అయ్యాడు సత్తిబాబు. ఒకే ముహూర్తానికి స్వప్న కుమారి , సునీత కు తాళి కట్టాడు సత్తిబాబు.
జిల్లాలోని చర్ల మండలం ఎర్ర బోరు గ్రామనికి చెందిన మడివి.ముత్తయ్య  కుమారుడు సత్తిబాబు ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నాడు.
దీనికి సంబధించిన పెళ్లి శుభలేఖ ఇప్పుడు భద్రాచలం లో వైరల్ గా మారింది.  భద్రాచలం డివిజన్లోని చర్ల మండలానికి చెందిన సత్తిబాబు, స్వప్నకుమారి, సునీత లు చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. స్వప్న ది దోసిళ్ళపల్లి గ్రామం , సునీత ది చెందిన కుర్ణపల్లి గ్రామం. యర్రబోరు కు చెందిన సత్తిబాబు  ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.

 

 

తరువాత విషయం తెలుసుకున్న స్వప్న, సునీతలు సత్తిబాబుతో కూర్చుని మాట్లాడి ఓ అంగీకారానికి వచ్చారు. గిరిజన కుటుంబానికి చెందిన వీరు వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారు కూడా అంగీకారం తో పెళ్లికి సిద్దమయ్యారు. గురువారం  ఉదయం7 గంటలకు లకు సత్తిబాబుకు, స్వప్న కుమారి, సునీతలతో వివాహం జరిపించేందుకు ఒక వరుడు, ఇద్దరు వధువుల తల్లిదండ్రులు అంగీకారాలతో వివాహం చేయడానికి నిశ్చయించారు.   ముహూర్తం సమయంలో వరుడు ముందు ఎవరికి తాళి కడతారనేదానిపై చర్చ కొనసాగింది.  ఈ వివాహం చూసేందుకు ఆహ్వానం లేనప్పటికీ వెళ్ళేందుకు అనేక మంది సిద్ధమయ్యారు.

 

Post Midle

Tags: One husband..two wives

Post Midle