రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మహబూబాబాద్ ముచ్చట్లు:
 
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం గుండంరాజుపల్లిలో పండగపూట విషాదం నెలకొంది. నర్సింహులపేట మండల కేంద్రం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుండంరాజుపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ట్రాక్టర్ లో ఇటుకలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈప్రమాదంలో గుండంరాజుపల్లికి చెందిన దుబ్బ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందగా… రవి అనే మరో వ్యక్తి పరిస్థితి విషమం ఉంది. స్థానికులు వెంటనే రవిని ఆసుపత్రికి తరలించారు. అయితే పండగరోజు కూడా లేబర్ పై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్ మూల మురళీధర్ రెడ్డి పనులకు పంపించారని సదరు కాంట్రాక్టర్ అత్యుత్సాహం వల్లే తమ బంధువు చనిపోయాడని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ మురళీ దగ్గర వెంకన్న, రవి  కొంతకాలంగా పాలేరుగా పనిచేస్తున్నారు. అయితే మృతుడి కుటుంబానికి ముప్పై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. మృతుడు వెంకన్నకు ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. అయితే బాధిత కుటుంబాలను పరిహారం అందించాల్సి వస్తుందని కాంట్రాక్టర్ మురళీ స్థానిక టీఆర్ఎస్ జడ్పీటీసీ భర్త  కావడంతో అందరితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: One killed in road accident

Natyam ad