రోడ్డు ప్రమాదంలో ఒకరుమృతి

Date:27/11/2020

ఏలూరు  ముచ్చట్లు

పశ్చిమగోదావరిజిల్లా గుండుగోలను శివారు దెందులూరు పరిధిలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఏలూరు వైపు నుంచి వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న షిఫ్ట్ డిజైర్ కారును ఢీకొట్టింది. అయితే  షిఫ్ట్ డిజైర్ కార్ లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  వారిని పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అటు ఇన్నోవా వాహనంలో ప్రయాణించే ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.  మృతుడు ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెం చెందిన మాణిక్యాలరావు (62) గా పోలీసులు గుర్తించారు.

 

రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి

Tags:One killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *