హైస్కూల్‌లో స్టేజ్‌ నిర్మాణానికి లక్ష విరాళం

One lakh donation for building stage in high school

One lakh donation for building stage in high school

Date:18/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కొత్తయిండ్లలో గల మున్సిపల్‌ హైస్కూల్‌లో స్టేజ్‌ నిర్మాణానికి స్కూల్‌ కమిటి చైర్మన్‌ శ్రీరాములు లక్షరూపాయలు విరాళం ఇచ్చారు. శుక్రవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మిక సంఘ నాయకుడు, కమిటి చైర్మన్‌ శ్రీరాములు తన కుమారుడు శ్రీఖర్‌సిద్దార్థ ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతూ గత ఏడాది జ్వరంతో మృతి చెందాడు. ఆబాలుడి జ్ఞాపకార్థం తండ్రి లక్షరూపాయలతో స్టేజ్‌ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచేందుకు దాతలు ముందుకురావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీరాములు ను కమిషనర్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి సన్మానించారు. శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సుబ్రమణ్యంరెడ్డి, ఏఈ కృష్ణకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

20న ఏపి ఎన్‌జీవోల ఎన్నికలు

Tags: One lakh donation for building stage in high school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *