Pleasant atmosphere in Tirumala

కరోనా నియంత్రణ చర్యలకు రూ.ఒక లక్ష విరాళం

Date:30/03/2020

సిరిసిల్ల  ముచ్చట్లు:

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కందేపి ప్రసాదరావు ,వారి సతీమణి రాణి ప్రసాద్ తమ ఉదారత కనబరిచారు. కరోనా కష్ట కాలంలో జిల్లా యంత్రాంగానికి రూ.ఒక లక్ష విరాళం అందజేశారు. కరోనా వైరస్‌ సంక్రమణ అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నియంత్రణ చర్యలకు పలువురు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న కష్టకాలంలో నియంత్రణ చర్యల కోసం, పేదలను ఆదుకోవడానికి ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కందేపి ప్రసాదరావు ,వారి సతీమణి రాణి ప్రసాద్ లు రూ.ఒక లక్ష విరాళం అందించారు. సోమవారం (మార్చి 30) కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ను కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

 

 

 

డా. కందేపి ప్రసాద రావు దంపతుల ఉదారతను కలెక్టర్  కృష్ణ భాస్కర్ కొనియాడారు. సదుద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి విరాళాలను అందించడం హర్షణీయమన్నారు . వీరి ప్రత్యేక చొరవ ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. కందేపి ప్రసాద రావు మాట్లాడుతూ కరోనా ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ప్రజలంతా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు సంపూర్ణ సహకారం అందించి… కరోనా మహమ్మారిని జిల్లా, రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు సహకారం అందించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

కత్తెర వరుణ్ కుమార్ 10 వేల విరాళం
సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యాపారి కత్తెర వరుణ్ కుమార్ తన స్నేహితుడు మహమ్మద్ మునీర్ తో కలిసి కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు సహాయకారిగా ఉండేందుకు వీలుగా రూ 10 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ కు కలెక్టరేట్లో అందించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు వీలుగా జిల్లా ప్రజలు ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విరాళం అందించిన కత్తెర వరుణ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అభినందించారు.

ఆదిలాబాద్‌ సరిహద్దులో విద్యార్థుల అడ్డగింత

Tags: One lakh donation for corona control measures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *