జూలై 31 నాటికి వన్ నేషన్- వన్ రేషన్

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
జూలై నాటికి అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల కోసం “వన్ నేషన్, వన్ రేషన్” పథకాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. “మహమ్మారి ముగిసేవరకు వలసదారులకు ఆహారం అందించడానికి రాష్ట్రాలు కమ్యూనిటీ కిచెన్లను నడపాలి” అని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు అదనపు ఆహార ధాన్యాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వలస కార్మికుల నమోదు కోసం, జూలై 31 లోగా పోర్టల్‌ని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా న్యాయమూర్తుల ధర్మాసనం “అసంఘటిత, వలస కార్మికుల వివరాలు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‌ని అభివృద్ధి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31 లోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలి” అని తెలిపారు. వలసదారులకు రేషన్ పంపిణీ కోసం రాష్ట్రాలు తప్పనిసరిగా పథకాన్ని తీసుకురావాలని కోర్టు తెలిపింది. ‘‘ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు జూలై 31 లోపు తప్పక అమలు చేయాలి’’ అని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం  స్పష్టం చేసింది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:One Nation- One Ration by July 31st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *