కారు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ముగ్గురు పరిస్థితి విషమం
పూతలపట్టు ముచ్చట్లు:

మంగళవారం ఉదయం పూతలపట్టు మండలం పాలకూరు జాతీయ రహదారిలో దుర్ఘటన జరిగింది.
ముందు వెళుతున్న కారును ఒక లారీ ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా బెంగళూర్ వాస్తవ్యులు. రు తిరుమల దర్శనం తరువాత బెంగళూరుకి తిరిగి వెళుతుండగా ఘటన జరిగింది. గాయపడ్డ వారిని హుటా హుటిన 108 లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; One person died in a car road accident
