Natyam ad

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మెదక్ ముచ్చట్లు:


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న  టాటా ఏసి మిని వాహనాన్ని వెనుక నుండి  గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో  ఒకరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమం గా వుంది. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించారు. బాధితులు  దండుపల్లీ,నాచారం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా మెదక్ ఏడుపాయల గుడికి వెళ్ళి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

 

Tags: One person died in a road accident

Post Midle
Post Midle