Natyam ad

చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి-ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్

కడప ముచ్చట్లు:


జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ ముస్కాన్” లో భాగంగా వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రుల కు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగిస్తున్నట్లు జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  తెలిపారు. మంగళవారం మైదుకూరు అర్బన్, రూరల్ పరిధిలో ‘ఆపరేషన్ ముస్కాన్’ లో భాగంగా పోలీసులు విముక్తి కల్పించిన 13 మంది చిన్నారులను జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్  తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పిల్లలకు మిఠాయిలు అందచేశారు. పిల్లల చదువుకు కావాల్సిన పుస్తకాలు, పెన్నులు,పెన్సిళ్లు, ఇతర స్టేషనరీ వస్తువులను అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి  మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను గుర్తించి కృషి చేయాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని అందరూ గుర్తుంచుకోవా లన్నారు. జిల్లాలో ఎక్కడా బాల కార్మికులు ఉండకూడదన్నారు. ఎవరైనా బాల కార్మికులను పని లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఆపరేషన్ ముస్కాన్’ ను ఐ.సి.డి.ఎస్., లేబర్, రెవిన్యూ సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లు, ఫుట్ పాత్ లు, హోటళ్లు, దాబాలు,గ్యారేజ్ లలో బాల కార్మికులుగా మార్చబడిన వీధి, అనాధ బాలలకోసం ముమ్మరంగా తనిఖీలు చేపట్టామన్నారు.  కార్యక్రమంలో మైదుకూరు డి.ఎస్.పి వంశీధర్ గౌడ్, మైదుకూరు అర్బన్, రూరల్ సి.ఐ లు  బి.వి చలపతి, నరేంద్ర రెడ్డి, మైదుకూరు ఎస్.ఐ గణ మద్దిలేటి, దువ్వూరు ఎస్.ఐ రాజు, ఖాజీపేట ఎస్.ఐ కుళ్లాయప్ప, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: One should study and rise to a higher level-SP KKN Anburajan

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.