Natyam ad

ప్ర‌ణాళికాబ‌ద్దంగా ల‌క్ష్యసాధ‌న‌కు కృషి చేయాలి- ఎస్‌పిడ‌బ్ల్యు క‌ళాశాల విద్యార్థినుల‌తో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి

– అధ్యాప‌క బృందానికి అభినంద‌న‌లు

 

తిరుప‌తి ముచ్చట్లు:

 

విద్యార్థులు ఒక ల‌క్ష్యాన్ని ఏర్ప‌ర‌చుకుని దాన్ని సాధించేందుకు ప్ర‌ణాళికాబ‌ద్దంగా కృషి చేయాల‌ని టిటిడి ఈవో    ఎవి.ధ‌ర్మారెడ్డి అన్నారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పిజి క‌ళాశాల‌ను గురువారం ఉద‌యం ఈవో సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌ను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ పిల్ల‌లు గొప్ప‌స్థాయికి చేరాల‌ని త‌ల్లిదండ్రులు, గురువులు ఆశిస్తార‌ని, ఇందుకు అనుగుణంగా విద్యార్థులు కృషి చేయాల‌ని కోరారు. త‌ల్లిదండ్రుల‌తోపాటు గురువులు చాలా ముఖ్య‌మ‌ని, ఆ గురువుల ద్వారానే ఎన్నో ల‌క్ష్యాల‌ను సుల‌భంగా చేరుకోవ‌చ్చ‌ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా తెలియ‌జేశారు. భార‌తంలో శ్రీ‌కృష్ణుడు – అర్జునుడు, ద్రోణాచార్యుడు – ఏక‌ల‌వ్యుడు, శ్రీ‌మ‌హావిష్ణువు – గ‌జేంద్రుడు, రామాయ‌ణంలో శ్రీ‌రాముడు – హ‌నుమంతుడి గురుశిష్యుల అనుబంధాన్ని తెలియ‌జేశారు. ఫ‌లితం గురించి ఆలోచించ‌కుండా క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించాల‌ని మ‌హాభార‌తంలో యుద్ధ స‌మ‌యంలో శ్రీ‌కృష్ణుడు అర్జునుడికి బోధించార‌ని, గురువును స్మ‌రించుకుని ఏకాగ్ర‌తతో సాధ‌న చేస్తే ఏక‌ల‌వ్యుడంత‌టి గొప్ప‌స్థాయికి చేరుతార‌ని, భాగ‌వతంలో మొస‌లికి చిక్కిన గ‌జేంద్రుడు ఆర్తితో కొలిస్తే ఉన్న‌ప‌లంగా శ్రీ‌మ‌హావిష్ణువు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని, రామాయ‌ణంలో హ‌నుమంతుడు గురుభ‌క్తితో త‌న హృద‌యంలోనే శ్రీ‌సీతారాముల‌కు స్థానం క‌ల్పించార‌ని తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఈవో విద్యార్థినుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. వారిని ఉత్తేజ‌ప‌రుస్తూ ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు.

 

 

Post Midle

అనంత‌రం క‌ళాశాల‌లోని గ్రంథాలయం, కంప్యూట‌ర్ ల్యాబ్‌, సైన్స్ ల్యాబ్‌లు, త‌ర‌గ‌తి గ‌దులు, పురాత‌న బావి, ఆల‌యం, హాస్ట‌ళ్లు, వంట‌శాల‌లను ప‌రిశీలించారు. హాస్ట‌ళ్ల‌లోని పాత వాట‌ర్ కూల‌ర్ల‌ను తొల‌గించి కొత్త‌వి ఏర్పాటుచేయాల‌ని, వంటశాల‌ల్లో అవ‌స‌ర‌మైన ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని, ఉద్యాన‌వ‌నాలను సుంద‌రీక‌రించాల‌ని, ఇత‌ర ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టాల‌ని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.

అధ్యాప‌క బృందానికి ఈవో అభినంద‌న‌లు

క‌ళాశాల‌కు ఇటీవ‌ల నాక్ ఎప్ల‌స్ గుర్తింపు ల‌భించినందుకు గాను ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ ఇత‌ర అధ్యాప‌క బృందానికి ఈవో అభినంద‌న‌లు తెలియ‌జేశారు. క‌ళాశాల‌లో చ‌క్క‌టి వాతావ‌ర‌ణం ఉంద‌ని, ఉన్న మౌలిక స‌దుపాయాల‌ను స‌ద్వినియోగం చేసుకుని గొప్ప‌పేరు తీసుకురావాల‌ని ఈవో కోరారు.జెఈవో  స‌దా భార్గ‌వి క‌ళాశాల ప్ర‌గ‌తిని వివ‌రించారు. అనంత‌రం వంద‌న స‌మ‌ర్ప‌ణ చేశారు. చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీ వేద వ‌ర్సిటీ రిజిస్టార్  రాధేశ్యామ్‌, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్)  వెంక‌టేశ్వ‌ర్లు, డిఎఫ్‌వో  శ్రీ‌నివాస్‌, క‌ళాశాల అధ్యాప‌కులు పాల్గొన్నారు.

 

Tags: One should work towards the goal according to the plan- TTD EO AV Dharmareddy with the students of SPW College

Post Midle

Leave A Reply

Your email address will not be published.