ఓ పక్క క్రీడా స్ఫూర్తి.. మరో పక్క అమ్మ ప్రేమ

Date:10/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆమె మంచి క్రిడాకారిణే కాదు, మనసున్న తల్లి కూడా. అందుకే, ఓ పక్క ఆడుతూనే తన బిడ్డ ఆకలి తీర్చుతూ అమ్మ మనసు గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. మిజోరం రాష్ట్రానికి చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లువాంగీ తుయికుం జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇటీవల జరిగిన పోటీకి ఆమె తన ఏడు నెలల పసిబిడ్డను వెంట తీసుకొచ్చింది. ఆట మధ్యలో బ్రేక్ లభించడంతో ఆమె తన బిడ్డకు పాలిచ్చింది. నింగ్లున్ హంఘల్ అనే మహిళ ఈ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటో మిజోరం క్రీడా మంత్రి రాబర్ట్ రొమావియాను కూడా ఆకట్టుకుంది. దీంతో ఆయన ఈ చిత్రాన్ని మిజోరం స్టేట్ గేమ్స్-2019కు మస్కట్‌ ఉపయోగిస్తమన్నారు. అలాగే, ఆమెను రూ.10 వేలు నగదు బహుమతితో సత్కరించాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క క్రీడా స్ఫూర్తి.. మరో పక్క అమ్మ ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈమెకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదూ.

 

విశాఖలో సెక్స్ రాకెట్…

 

Tags:One side sports inspiration .. Another side mom love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *